పేద ఆర్యవైశ్యుల కోసం వైకుంఠ భవన్

పేద ఆర్యవైశ్యుల కోసం వైకుంఠ భవన్

 విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చంద్రన్న కుంట బజార్ లో నాగులమ్మ గుడి వెనుక భాగంలో పేద ఆర్యవైశ్యులు మరణిస్తే వారి కర్మ కాండల కొరకు బుధవారం పట్టణ  ఆర్య వైశ్య మహాసభ మాజీ  ప్రధాన కార్యదర్శి కలకోట లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మిత్రులు  కొనుగోలు కొరకు స్థలాన్ని  పరిశీలించారు. ఈ సందర్బంగా పలువురు ఆర్య వైశ్య మహాసభ నాయకులు మాట్లాడుతూ,  అగ్ర కుల ఆర్యవైశ్యులలో కూడా ఎంతో మంది పేద ఆర్యవైశ్యులు ఉన్నారని,సొంత ఇండ్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ జీవనాన్ని కొనసాగుతున్నారని తెలిపారు. కుటుంబ సభ్యులలో ఎవరైనా మరణిస్తే అద్దె యజమానులు దహన సంస్కారాలకు అంగీకరించక పోవడంతో ఎన్నో ఇబ్బందులకు గురై తున్నారని,వారి కొరకు వైకుంఠ కర్మకాండ భవన్ నిర్మించినట్లు ఐతే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ఆధ్యాత్మిక, సమాజ సేవ,దాన ధర్మాల్లో ముందు ఉండే ఆర్యవైశ్యులు పేద ఆర్య వైశ్యుల కొరకు నిర్మించే ఈ భవన్ కు   సహరించాలని తెలిపారు. త్వరలో త్వరలో పట్టణంలోని ఆర్యవైశ్య ప్రముఖులతో చర్చించి శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.స్థలం పరిశీలించిన వారిలో జిల్లా  ఆర్య వైశ్య మహా సభ మాజీ యువజన సంఘం అధ్యక్షుడు మీలా వంశీ ఉపాధ్యక్షులు బిక్కుమల్ల కృష్ణ, రాచకొండ శ్రీనివాస్,బచ్చు పురుషోత్తం, పట్టణ ఆర్యవైశ్య మహాసభ మాజీ కన్వీనర్ కుక్కడపు శ్రీనివాస్, వెంపటి శబరినాథ్, కంద గట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags: