ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ లక్ష్యం

ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ లక్ష్యం


  • : మేడిపల్లి మండల కార్యదర్శి రచ్చ కిషన్

విశ్వంభర, బోడుప్పల్ :  బోడుప్పల్ సర్కిల్ 11వ డివిజన్ ఇందిరానగర్ కాలనీలో బుధవారం ఉదయం మేడిపల్లి మండల కార్యదర్శి రచ్చ కిషన్ ఆధ్వర్యంలో ఇంటింటికి సిపిఐ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రచ్చకిషన్ మాట్లాడుతూ,  కుల, మత, అవకాశవాద రాజకీయాలను తిప్పికొడదాం, మానవహక్కులను, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామన్నారు. దేశంలో పెరుగుతున్న నిత్యవసరాల ధరలు, నిరుద్యోగం, రైతుల కష్టాలు, విద్య, ఆరోగ్యరంగాలలో సంక్షోభం వంటి అంశాలు ప్రజల జీవితాలను కుదిపేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఇంటింటికి సిపిఐ ప్రజా సమస్యల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, పోరాటాల ద్వారా పరిష్కారం సాధించడం కోసం కార్యాచరణ రూపొందిస్తున్నామని రచ్చకిషన్ వివరించారు. పంటలకు సరైన కనీసమద్దతు ధర ఎంఎస్పి లేకపోవడం ఎరువులు, విత్తనాల ధరలు పెరగడం, రుణ భారం వల్ల రైతుల ఆత్మహత్యలు, పంట బీమా సరైన విధంగా అమలుకాకపోవడం, కార్మికుల సమస్యలు కనీస వేతనాలు అందక నానా ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థ పెరుగుదల, కార్మిక హక్కుల ఉల్లంఘన. విద్యాసంస్థల్లో ఫీజుల భారంతో చదువు భారం అవుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో నిర్లక్ష్యం, ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, ఆరోగ్య సమస్యలు ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాల లేమి.. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ, మందుల ధరల పెరుగుదల. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ కరువైందని ఆరోపించారు. నిత్యవసర సరుకుల ధరలు పెరిగి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గృహ సమస్యలు, ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం, గృహపథకాలలో అవినీతి, మౌలిక వసతులు, తాగునీటి సమస్య, డ్రైనేజీ, రోడ్లు దారుణపరిస్థితి దర్శనమిస్తోందన్నారు. పట్టణ ప్రాంతాలలో అభివృద్ధి లేకపోవడం వల్ల ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని రచ్చకిషన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి సి.హెచ్.మాధవి, జి.నాగరాజు, బీసీ సంఘం జిల్లా నాయకురాలు కే.ప్రమీల, మండల కౌన్సిల్ సభ్యులు భూతం ఐలయ్య, నరసయ్య, సిపిఐ పార్టీ నాయకులు ఇస్తారి, సోమరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags: