బార్ అసోసియేషన్కు సంపూర్ణ సహకారం
On
విశ్వంభర, సిద్దిపేట: ఇటీవల ఎన్నికైన సిద్దిపేట బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అభినందించారు. మంగళవారం రాత్రి నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ కార్యవర్గం, న్యాయవాదులు హరీశ్రావును మర్యాద పూర్వకంగా కలిశారు. నూతన అధ్యక్షుడు, కార్యవర్గాన్ని శాలువాతో సత్కరించారు. బార్ అసోసియేషన్కు నా సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రమేష్ బాబు, ఉపాధ్యక్షురాలు అరుణ, ప్రధాన కార్యదర్శి సదానందం, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శి లక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులు పూజ, కార్తీక్, ఫణి కిషోర్, రాజం, రాజేష్, రాములు, రాధాకృష్ణ శర్మ, మోహన్ లాల్, జనార్దన్, గోవర్ధన్ రెడ్డి, పాల సాయిరాం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



