మైనార్టీ కమిషన్ సభ్యురాలికి సన్మానం
On
విశ్వంభర, ఢిల్లీ : మైనార్టీ కమిషన్ జాతీయ సభ్యురాలిగా నియమితులైన మునావరి బేగంను ఘనంగా సన్మానించారు. ఢిల్లీలోని మైనార్టీ కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని అభినందనలు తెలిపారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మైనార్టీల అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజ సేవలో ఆమెకు ఉన్న అనుభవం దేశవ్యాప్తంగా మైనార్టీల సమస్యల పరిష్కారానికి ఉపయోగ పడుతుందని తెలిపారు. కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.



