గ్రామాభివృద్ధికి బాటలు వేసిన గ్రామసభ – పథకాలపై స్పష్టమైన అవగాహన
విశ్వంభర, షాబాద్ :- చందనవెల్లి గ్రామంలో గ్రామసభను గ్రామ సర్పంచ్ చేవెళ్ల నవనీత స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలపై గ్రామస్తులకు సమగ్ర అవగాహన కల్పించారు.ఇందులో భాగంగా ఇందిర ఇండ్ల పథకం, గృహజ్యోతి, సన్న బియ్యం, నూతన రేషన్ కార్డులు, రైతు భరోసా వంటి పథకాల వివరాలను వెల్లడించారు. ఇప్పటికే లబ్ధి పొందిన వారి వివరాలను తెలియజేసి, గ్రామస్థుల అభిప్రాయాలను సేకరించారు. పథకాలపై ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ, అర్హులందరికీ ప్రభుత్వం అందించే సాయం అందేలా కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు.అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం గ్రామంలో ఆడబిడ్డ పుట్టిన కుటుంబాలకు రూ.10,000 అందజేస్తామని పేర్కొంటూ, నేడు పోలారం సరిత – నరేష్ దంపతులకు పుట్టిన ఆడబిడ్డకు రూ.10,000 చెక్కును అందజేశారు.నీటి ప్రాధాన్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ, నీటిని పొదుపుగా వినియోగించాలనే ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ప్రణీత్, ఉప సర్పంచ్ చాకలి శ్రీశైలం, వార్డ్ మెంబర్లు శ్రీహరి, మీరంపల్లి వెంకటేష్, గుర్రం రమేష్, బోనాల వెంకటయ్య, బేగరి గీత, నాయకులు వడ్ల రాఘవాచారి, శ్రీకాంత్ రెడ్డి, మహేష్, కందివనం రామస్వామి గౌడ్, గోపాల్, అప్పాలి కిష్టయ్య, గడియల కిష్టయ్య, పంతులు రామచందర్, రాజమల్లు, రాజేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కే రామచంద్రి, షాబాద్ అనసూయ, కోలన్ అనసూయ, గుడిసె శోభ, మంజుల తదితరులు పాల్గొన్నారు.



