సీఐ బాధ్యతల స్వీకరణ
On
విశ్వంభర, ఘట్కేసర్: మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ సీఐగా కె. కనకయ్య గౌడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పోచారం పోలీస్ స్టేషన్లో గత రెండు సంవత్సరాల నుండి పనిచేసిన బి.రాజు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కనకయ్యకు పోచారం పోలీస్ స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికారు.



