ప్రజాపాలనతోనే రైతులకు న్యాయం

ప్రజాపాలనతోనే రైతులకు న్యాయం

విశ్వంభర, సిద్దిపేట: సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తుం  దని మార్కెట్ కమిటీ ఛైర్మన్ మీసం మహేందర్ అన్నారు. చిన్నకోడూరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన పాలకవర్గ సమావేశంలో మహేందర్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొన్న సమస్యలు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వివేక్ సహకారంతో తీర్చుతామన్నారు. తమ పాలకవర్గం ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిగా పనిచేస్తుందని చెప్పారు. వరి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. గంగాపూర్‌లో మూతపడిన మిర్చి మార్కెట్‌ను త్వరలో ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఏంసీ వైస్ ఛైర్మన్ బుస్సా రాజశేఖర్, డైరెక్టర్లు నముండ్ల వినోద్, రాజ వర్ధన్ రెడ్డి, విజయ్ రెడ్డి, పాకాల భూపతి రెడ్డి, మహమ్మద్ సలీం, తాళ్లపల్లి రాజు, సింగిరాల బాల్ లక్ష్మి, దేవరాయ సోనీ, ద్యావ కరుణాకర్, మాచిరెడ్డి మహిపాల్ రెడ్డి, రాగుల అశోక్, గుండెల్లి నాగరాజు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: