గురువారం నుండి ప్రజాపాలన గ్రామసభలు
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజా పాలన గ్రామసభలు రేపు అన్ని గ్రామాల్లో నిర్వహించాలని మండల తహసిల్దార్ లాల్ బహదూర్ మండల, గ్రామ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట ఎంపీడీవో రాములు, తహసిల్దార్ లాల్ బహదూర్, ఎంపీఓ రాహుఫ్ అలీ, మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పాలన అధికారులు పాల్గొన్నారు.



