అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఎన్నిక
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు స్థానిక రహదారి బంగ్లాలో సమావేశాన్ని ఏర్పాటు చేసి అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ కన్వీనర్ గా బొడ్డు సురేందర్ రావు, కో కన్వీనర్ గా నాగటి ఉపేందర్, సోషల్ మీడియా కన్వీనర్ గా ఎర్ర నరేష్ లతో పాటుగా కమిటీ సభ్యులుగా మరో 13 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండలంలో అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అన్ని గ్రామాల నుండి అంబేద్కర్ అభిమానులను సమీకరణ చేసి మండల కేంద్రంలో భారీ ర్యాలీతో జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని అన్నారు. నూతన కమిటీ సభ్యులుగా నల్ల స్వామి,నోముల చిరంజీవి, కంచి మధుసూదన్, కోళ్ల రామకృష్ణ,కక్కిరేణి విజయ్ కుమార్,భాష మల్ల సంతోష్,గాదె నరేందర్, నకిరేకంటి నరేందర్, బొడ్డు శంకర్,జన పాల లక్ష్మణ్,నకరికంటే మొగులయ్య, బలుగూరి అంజయ్య, ఏలూరి రవి, ఎన్నికయ్యారు.



