హిందూ సమ్మేళనం విజయవంతం 

హిందూ సమ్మేళనం విజయవంతం 

విశ్వంభర,  బోడుప్పల్: బోడుప్పల్ సర్కిల్ లోగల మారుతీ నగర్ శ్రీ దాసాంజనేయ స్వామి సహిత శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్వహించిన మారుతీ నగర్ బస్తి తో పాటు ౩౦ కాలానీల హిందూ సమ్మేళన కార్యక్రమం విజయమైంది. ఈ కార్యక్రమంలో సమృద్ధి  డాన్స్ స్కూల్ చిన్నారుల నృత్య ప్రదర్శన, వివిధ కాలనీల నుండి విచ్చేసి  హైందవ ధర్మ గీతాలు పాడారు, ప్రొఫెసర్ డా. వెంకటరమణ అల్లూరి సీతారామ రాజు ఏకపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  హిందూ సమ్మేళనం ఆహ్వాన సమితి అధ్యక్షులు సిలివేరు శంకర్ ప్రజాపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి, కాశి విశ్వనాథ  పీఠాధిపతి శ్రీ దుర్గానందాపురి స్వామిజి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,  దేశం, ధర్మం అనే విషయాలలో కేవలం మాటలలో కాకుండా చేతలలో కూడా ముందుకు వచ్చే చైతన్యం, దైర్యం అందరికి ఉండాలన్నారు. విశిష్ట అతిధిగా విచ్చేసిన గీతా పరివార్ రాష్ట్రీయ ప్రచారక్   డా. శీల్పా దీదీ  మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థ విలువలతో బలోపేతం కావాలని, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు లక్షల మొక్కలు నాటాలని, దేశ పౌరుడుగా మన బాధ్యతలు విధులు ఇంట్లో వున్నా తల్లిదండ్రుల నుండే మొదలవ్వాలన్నారు. పిల్లలకు మంచి చేడు వ్యత్యాసాన్ని బోధించి ధర్మ మార్గంలో నడిపించాలనీ కోరారు.  ముఖ్య వక్తగా విచ్చేసిన ఆర్ ఎస్ ఎస్  తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ కట్ట రాజగోపాల్  మాడ్లాడుతూ ఆర్ ఎస్ ఎస్ శతాబ్ది ఉత్సవాలలో మనమందరం ఈ రకంగా ప్రత్యక్షంగా పాల్గొని మన హిందుత్వ వైభవాన్ని చాటిచెప్పడం గొప్ప విషయము మాత్రమే కాదు మనకు అత్యంత గౌరవమని ,  సంఘంలో వ్యక్తి నిర్మాణం ఏ రకంగా జరుగుతుందో స్వయంసేవకులను చూస్తే అర్థమౌతుందన్నారు.  గౌరవ అతిధి గా విచ్చేసిన రిటైర్డ్ డివిషనల్ మేనేజర్ ఒఐసిఎల్, హై కోర్ట్ న్యాయవాది గడప నాగయ్య మాట్లాడుతూ ౩౦ కాలనీల సంగమంగా సమాజంలో ఏకాత్మత భావం చాటేవిదంగా సమైక్యతను జాగృతం చేయడంకోసం హిందూ సమ్మేళనాలు మార్గదర్శకాలుగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సమితి ప్రధాన కార్యదర్శి వడ్ల ముత్యమా చారి ఉపాధ్యక్షులు ఎన్.రామచంద్ర మూర్తి, ఎం.జగన్నాధం, అరుణ్ కుమార్ పాండే, జి.యాదగిరి, అర్థ ధర్మ రెడ్డి, ఇ.లక్ష్మీనారాయణ, జి. చంద్రశేఖర్, బచు గణేశం, కార్యదర్శులు వినోద్, జి.రాజీ రెడ్డి, రమేష్ గౌడ్, మహిళా సభ్యులు సిలివేరు శ్యామారాణి, నర్మద, గౌరీ, సులోచన, కె. విజయలక్ష్మి, 30 కాలనీల అధ్యక్షులు  వారి కార్యవర్గం, ఉప్పల్ బాగ్ మరియు బోడుప్పల్ నగర్ అర్ ఎస్ ఎస్, వీ హెచ్ పీ నాయకులు, వందలాది హిందూ బంధువులు పాల్గొన్నారు.

Tags: