ఇ-కిడ్స్ కాన్వకేషన్ డే వేడుకలు
On
విశ్వంభర, ఉప్పల్: ఉప్పల్ నారాయణ పాఠశాలలో కాన్వకేషన్ వేడుక బుధవారం న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జి.యం. గోపాలరెడ్డి, ఏజీయం బాలపరమేశ్వర్ రావు, ఆర్ ఎన్ డి హెడ్స్, కోఆర్డినేటర్స్,ప్రధానోపాధ్యాయులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకను ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించి తరువాతి తరగతిలో అడుగుపెడుతున్న సందర్భంగా పట్టభద్రులైన విద్యార్థులకు కాన్వకేషన్ డే ను నిర్వహించి ప్రశంసా పత్రాలను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తమ అనుభవాలను తెలుపుతూ గురువులకు కృతజ్ఞతలు తెలిపారు.



