గ్యాస్ కొరత తగ్గించాలని నిరసన
On
విశ్వంభర, హైదరాబాద్ : నాచారం చౌరస్తాలో ఆటో ఎల్పీజీ, సిఎన్జి గ్యాస్ కొరత, అధిక ధరలపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్‌టీయూ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. చౌరస్తా నుంచి మల్లాపూర్ ఇండియన్ గ్యాస్ పంపు వరకు భారీగా ర్యాలీ నిర్వహించి, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్యాస్ కొరతను వెంటనే నివారించాలని, ధరలను నియంత్రించాలని, ఆటో డ్రైవర్లకు సహాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా, బ్లాక్‌లో గ్యాస్ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫైనాన్స్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న డ్రైవర్లపై ఒత్తిడి చేయవద్దని, అలాగే లైసెన్సుల జారీ, రీన్యువల్ ప్రక్రియను సులభతరం చేయాలని రవాణా శాఖను కోరారు.



