ఔషధ దాతృత్వం మూగజీవాలకు ప్రాణదానం
On
- డా.పెంటయ్య
విశ్వంభర, కోదాడ: కోదాడ పట్టణ ప్రాంతీయ పశువైద్యశాలలో పశు ప్రాణసంరక్షణ, పశుపోషకులకు చేయూతతో లాభసాటి పశుపోషణ లక్ష్యంగా నిర్వహిస్తున్న పశు ఔషధ బ్యాంక్ సేవలకు ఆకర్షితులైన కోదాడ పట్టణ వాసి నిస్సార్ అహ్మద్ తాను సైతం జంతు ప్రేమలో ముందుంటానని తెలిపారు. పశువులకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగానికి కావలసిన పశు ఔషధాలను ఆయన విరాళంగా అందించిన సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ డా.పి. పెంటయ్య బుధవారం వారిని అభినందించారు. ఈ క్రమంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న పశు ఔషధ బ్యాంక్ సేవలను ఇటీవల జిల్లా కలెక్టర్ సైతం ప్రశంసించారని, నిస్సార్ అహ్మద్ విరాళం విలువైనదని అన్నారు. పశు ఔషధ బ్యాంక్ ద్వారా మూగ జీవాల రక్షణకు సహకరిస్తున్న దాతలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రాజు, చంద్రకళ , శివ, సాగర్, నజీర్ తదితరులు పాల్గొన్నారు



