హనుమాన్ జయంతికి ముమ్మరంగా ఏర్పాట్లు 

హనుమాన్ జయంతికి ముమ్మరంగా ఏర్పాట్లు 


 విశ్వంభర, జిహెచ్ఎంసి: హనుమజ్జయంతి పర్వదినాన్ని  పురస్కరించుకొని ప్రసిద్ది చెందిన కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానములో ఉ.5.00 గం.లకు స్వామి వారికి ప్రత్యేక అభిషేకము, అనంతరం ఉ.7.00 గం.ల నుండి దర్శనములు, ఆకు పూజలు, అర్చనలు నిర్వహిస్తారు . ఈ సందర్భంగా ఆలయ సందర్శనకు విచ్చేయు అసంఖ్యాక భక్త జన సౌకర్యార్థము ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాటు చేశారు.  గత సంవత్సరము అనుభవముల దృష్ట్యా భక్తులు  ఎండలలో వేచి యుండకుండా క్యూ లైన్లు అంతటా చలువ పందిర్లు ఏర్పాటు చేయడం జరిగినది. భక్తులకు మంచినీరు, మజ్జిగ, ఉచిత తీర్థ ప్రసాద వితరనకు ఏర్పాట్లు చేయడం జరిగింది.  అదనపు ప్రత్యేక దర్శన టిక్కెట్, ప్రసాదము కౌంటర్లను తెరచి భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనములు చేసుకొని ప్రసాదములు కొనుగోలు చేసుకొనుటకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆలయ కార్యనిర్వహణధికారి, చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు ఆల సిబ్బందితో బుధవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో  పలు సూచనలు చేశారు .ఆలయము అంతయూ పూలు, విద్యుత్ అలంకరణతో శోభాయమానంగా అలంకరించి భక్తులు త్వర త్వరగా దర్శనాలు చేసుకొనడానికి ప్రత్యేక దృష్టి సారించాలని కార్యనిర్వహణాధికారి గారు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.సమీక్షా సమావేశములో ఆలయ కార్యనిర్వహణాధికారి  యన్. లావణ్య, చైర్మన్  ఈదులకంటి సత్యనారాయణ రెడ్డి, ధర్మకర్తలు  దిండు ప్రవీణ్ గౌడ్, తోకటి కిరణ్ కుమార్, నారాయణ్ దుర్గా రెడ్డి, కొండ సంతోష్ కుమార్, ఎనుముల రవీందర్ రెడ్డి, ఆలయ అర్చకులు, సిబ్బంది హాజరు అయ్యారు.

Tags: