నెల్లికుదురుకు పబ్లిక్ స్కూల్ మంజూరు

నెల్లికుదురుకు పబ్లిక్ స్కూల్ మంజూరు


  • మాది రైతు ప్రభుత్వం..ప్రతి గింజ కొంటాం: 
  • ఎమ్మెల్యే డా.మురళి నాయక్

విశ్వంభర, నెల్లికుదురు: మండల కేంద్రం నెల్లికుదురుకు సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిల సహకారంతో పబ్లిక్ స్కూల్ మంజూరైనట్లు ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి,  రైతులు పండించిన ప్రతి మొక్కజొన్న చివరి గింజ వరకు కొంటామన్నారు. మండల కేంద్రం నెల్లికుదురులో మార్క్ ఫెడ్, పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బుధవారం ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  నెల్లికుదురులోని ప్రభుత్వ పాఠశాలల స్థలంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో సుమారు 1500 మంది స్టూడెంట్స్ కు నాణ్యమైన విద్యా వసతి సమకూరుతుందన్నారు. ఎన్ని ఇబ్బందులు అయినా కర్షకుల కోసం మొక్కజొన్నలు క్విం.రూ.2,400 మద్దతు ధర ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని, మాయచ్చర్ 14శాతం ఉండే విధంగా తూర్పారబట్టి జొన్నలను సెంటర్ కు తీసుకురావాలని రైతులకు సూచించారు. అన్నదాతలకు యూరియా ఇబ్బంది కలగకుండా చూసామన్నారు.వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తకుండా ఆయా గ్రామాలలో తండాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశించామన్నారు.మహబూబాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. ఇప్పటికే అన్ని గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా రోడ్లు నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి పులి వెంకన్న,తహసిల్దార్ చంద నరేష్,పిఐసి,పి ఎసిఎస్ జె.మనోహర్రావు,సెక్రటరీ యాదగిరి, వివిధ గ్రామాల సర్పంచులు,ఏఎంసీ డైరెక్టర్లు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్,పార్టీ జిల్లా, మండల,గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: