బాధిత కుటుంబానికి రూ.25 వేల సహాయం

బాధిత కుటుంబానికి రూ.25 వేల సహాయం

విశ్వంభర, ఇనుగుర్తి: రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం. ఉన్నట్లుండి తండ్రి పడాల అశోక్ అనారోగ్యంతో కన్నుమూశాడు. ఈ ఘటన ఇటీవల మండల కేంద్రం ఇనుగుర్తి లో జరిగింది. చలించిపోయిన జర్నలిస్టు ఎలమాద్రి ప్రభాకర్ ఒక్క ఐడియా సహాయం చేసే వారిని కదిలించింది. "విధి ఆడిన వింత నాటకం అనాధలైన అభం శుభం తెలియని పసి మొగ్గలు"అంటూ సహాయం చేయండి అని'మా ఊరు ఇనుగుర్తి'వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. స్పందించిన గ్రామస్తులైన యువకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఒక్కొక్కరుగా తమ శక్తి మేర ఫోన్ పే చేశారు. రూ.25 వేలు, 3 క్వింటాళ్ల బియ్యం సమకూరాయి. నగదును మృతుని ఇద్దరు కుమారులు ఇలయ రాజ్, యశ్వంత్ రాజ్ ల పేర పోస్టాఫీస్ లో ఫిక్స్ డు డిపాజిట్ చేశారు. ఎస్సై కరుణాకర్ తదితరుల చేతుల మీదుగా బుధవారం సంబంధిత ఫిక్స్ డు డిపాజిట్ బాండ్ పత్రాలను, బియ్యాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.తండ్రిని కోల్పోయిన చిన్నారులకు నగదు,బియ్యం సేకరించి అందజేయడం పట్ల మా ఊరు ఇనుగుర్తి వాట్సాప్ గ్రూప్ ను ఎస్సై కరుణాకర్ అభినందించారు. గ్రూప్ సభ్యులను సహాయం చేసే దిశగా కదిలించిన జర్నలిస్ట్ ప్రభాకర్ ఆలోచనకు కితాబిచ్చారు.కేవలం కాలక్షేపానికే గ్రూపులను వాడుకోమని,మంచి పనికి ముందుంటామని చేతల ద్వారా నిరూపించిన సభ్యులను అభినందించారు. ఈ  కార్యక్రమంలో దిశ సభ్యులు గుజ్జునూరి బాబురావు,పప్పుల వెంకన్న (108), ఇసంపల్లి జానీ, మంకాళి సలీం, తమ్మడపల్లి యాకుబ్, పవన్, అశోక్, సురేష్, భరత్ గుజ్జునూరి నరేష్, వినయ్, ప్రసాద్, పసునూరి జంపయ్య, గబ్బటి కుమార్, దాసరి జేమ్స్, దేవులపల్లి శ్రీకాంత్, మధు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Tags: