మండల వ్యాప్తంగా గ్రామ సభలు
On
విశ్వంభర, గుండాల : ప్రజాపాలన-ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న గుండాల మండలంలోని 20 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో చండీరాణి తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ సభలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. గ్రామ సమస్యలు, అభివృద్ధి పనులపై ప్రజలు సూచనలు అధికారులకు తెలియజేయాలని ఆమె కోరారు.



