బ్రెయిన్ డీ మ్యాథమాటిక్స్ లో కృష్ణవేణి స్కూల్ ప్రతిభ
విశ్వంభర, మహబూబాబాద్ : హైదరాబాదులో నిర్వహించిన బ్రెయిన్ డీ మాథెమాటిక్స్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ పోటీలలో రాష్ట్రం నలుమూలల నుండి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతిష్టాత్మక పోటీలలో జిల్లా కేంద్రంలోని మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ స్టేట్ లెవెల్ గ్రాండ్ ఛాంపియన్షిప్ సాధించడం చాలా గర్వకారణం అని, ఈ విజయాన్ని సాధించిన సందర్భంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో అభినందన సభ ఏర్పాటు చేశారు . ఛాంపియన్షిప్ లో గెలిచిన విద్యార్థులు హజీరా ,సాదియా, లోషన్ నాయక్, హర్షితా రాథోడ్, జే నేహా వీరు తమ ప్రతిభతో ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకుందని అన్నారు .చాలా చక్కగా వారు మాథ్స్ లో ప్రదర్శించిన తీరు అద్భుతం అని రాష్ట్ర స్థాయిలో మన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ను నిలిపి నందుకు వారిని అభినందించారు . ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆవుల శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ ప్రీతి రెడ్డి ,లు పాఠశాల ఉపాధ్యాయ, బృందం విద్యార్థిని, విద్యార్థులు, పాల్గొన్నారు .



