కురుమ ఆత్మగౌరవ భవనం అద్దెకు ఇవ్వ వద్దు 

కురుమ ఆత్మగౌరవ భవనం అద్దెకు ఇవ్వ వద్దు 

విశ్వంభర, హైదరాబాద్ : కురుమ కులస్థుల యువతకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించాలని, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య ఆత్మ గౌరవ భవనాన్ని అద్దెకు ఇవ్వవద్దని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం సీనియర్ నాయకులు దొడ్డి శ్రీనాద్, శీలంపల్లి సురేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఆధ్వర్యంలో  హైదరాబాదు ఇందిరాపార్కు ధర్నా చౌక్ లో దొడ్డి కొమురయ్య ఆత్మగౌరవ భవనం, కురుమ సంఘం ఆస్తులను కాపాడుకుదాం అంటూ డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో కురుమ యువత భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదెకరాల స్థలంలో సుమారు ఐదు కోట్ల నిధులతో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య ఆత్మగౌరవ భవనం పేరుతో నిర్మించిన భవనాన్ని కురుమ సంఘం అధ్యక్షులు యెగ్గ మల్లేషం నారాయణ విద్యా సంస్థలకు అద్దెకు ఇచ్చి కమర్షియల్ భవనంగా మార్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ భవనంలో కురుమ కులస్థులకు ఉపయోగపడే విధంగా ఐటీహబ్ ఏర్పాటు చేసి కురుమ విద్యార్ధులలో నైపుణ్యాభివృద్ధిని పెంచే విధంగా అభివృద్ధి చేయడానికి కార్యచరణ రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. దొడ్డి కొమురయ్య ఆత్మగౌరవ భవనాన్ని కొంత మంది వ్యక్తులు సొంత ఆస్తిగా వాడుకోవాలని చూస్తే ఊరుకోభమని వారు హెచ్చరించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అడికె సంతోష్, మాదారం కృష్ణ, కరికె సత్యనారాయణ, ఎర్రం సత్యనారాయణతోపాటు కురుమ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: