పాఠశాలకు వ్యాన్ బహూకరణ అభినందనీయం
: ఎమ్మెల్యే డా.మురళీ నాయక్
విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని పార్వతమ్మ గూడెం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల రాకపోకల కోసం రూ.6.50 లక్షలతో మినీ వ్యాన్ బహూకరించడం పట్ల దాత భూక్య వెంకన్న సేవా నిరతిని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ అభినందించారు. సంబంధిత వ్యాన్ ను ఆ గ్రామ సర్పంచి ఎదల్ల పూలమ్మ, ఎంఈఓ రాందాస్, హెచ్.ఎం.హెచ్చు నరేంద్ర కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల, బ్లాక్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, యాదవ రెడ్డి, మహిళా నాయకురాలు హెచ్ అలివేలు తదితరులతో కలిసి ఎమ్మెల్యే హనుమాన్ ఆలయంలో పూజలు చేసి బుధవారం ప్రారంభించారు. అనంతరం హెచ్ఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, వ్యానును ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పట్ల హెచ్ఎం నరేంద్ర కుమారుడు ఎమ్మెల్యే ప్రశంసించారు.యాదవ రెడ్డి, ఎంఈవో,హెచ్.ఎం.ల అభ్యర్థన మేరకు పాఠశాలకు త్వరలోనే ప్రహరీ గోడ, అనంతరం అదనపు గదులు మంజూరి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు , ఉపాధ్యాయులు పాల్గొన్నారు



