రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తా; నారా లోకేష్
తాను ఇంకా మంత్రిగా బాధ్యతలు తీసుకోలేదు గానీ.. రాష్ట్రంలో ఉన్న ప్రతిపెండింగ్ ప్రాజెక్టును పరిశీలిస్తానని.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంత్రి హోదాలో మొట్టమొదటి సారి ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు.
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఇంకా టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని.. వాటిని వైసీపీ మూకలే చేయిస్తున్నాయంటూ మండిపడ్డారు. చంద్రబాబు గారి ఆదేశం ప్రకారం తాము ఇంకా నోరు మెదపట్లేదని.. ఆయన వల్లే కంట్రోల్ లో ఉన్నామని నారా లోకేష్ తెలిపారు. ఇక, రెడ్ బుక్ తన పని తాను చేసుకోబోతుందని సున్నితంగా హెచ్చరించారు.
మంగళగిరిలో పేదల కోసం ఇండ్లు నిర్మించేందుకు తాను మంత్రి పార్థసారథిని కలిసి విన్నవించినట్టు తెలిపారు మంత్రి లోకేష్. మంగళగిరి ప్రజల రుణం తీర్చుకుంటానని.. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటూ తెలిపారు మంత్రి లోకేష్. త్వరలోనే వైసీపీ దాడుల్లో గాయపడిని వారిని పరామర్శిస్తానంటూ తెలిపారు లోకేష్.