సెంట్రింగ్ రేట్లు పెంచాలి
విశ్వంభర, ముషీరాబాదు : ఇనుము ధరలు విపరీతంగా పెరగడంతో సెంట్రింగ్ కాంట్రాక్టర్ల పై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని గ్రేటర్ హైదరాబాదు సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. కృష్ణ, చైర్మన్ ఎస్. పరశురాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎండి. చంద్ పాషా, కోశాధికారి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత రేట్లతో పనులు కొనసాగించడం కష్టమైందని పేర్కొన్నారు. హైదరాబాదు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకుల ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నాయకులు మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువచ్చి పనులు నిర్వహిస్తున్నప్పటికీ లాభం లేకపోగా నష్టాలే వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్రింగ్ రేట్లను చదరపు అడుగుకు రూ.51గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు శాశ్వత గుర్తింపు కార్డులు, ఈఎస్ఐ వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. 55 సంవత్సరాలు నిండిన వారికి నెలకు రూ.3000 పెన్షన్, ప్రమాద మరణాలకు రూ.20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు శిక్షణతో పాటు వడ్డీ రహిత రుణాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మహమ్మద్ మన్సూర్, శ్రీనివాస్ రెడ్డి, మిర్జా చౌక్ బేగ్, పాల్గుణ రావు, రుక్మాంగద రావు, బి. అంజయ్య, వీరేష్ యాదవ్, మొహమ్మద్ ఫక్రుద్దీన్, చారి మమ్మ, జాబి షేక్ ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.