శ్రీమతి మహిళా కాంటెస్ట్ విజేత ప్రసన్న

శ్రీమతి మహిళా కాంటెస్ట్ విజేత ప్రసన్న

విశ్వంభర, హైదరాబాదు : బేగంపేట టూరిజం ప్లాజాలో పరివర్తన మీడియా ఆధ్వర్యంలో ‘శ్రీమతి మహిళా కాంటెస్ట్’ నిర్వహించారు. ఈ సందర్బంగా  పరివర్తన్ మీడియా నిర్వాహకురాలు పూజ చౌదరి మాట్లాడుతూ, మహిళలు వంటింటికే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇతర మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరం అని అన్నారు. ఈ సందర్భంగా మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి మాట్లాడుతూ, స్త్రీ చదువుకుంటే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళల ప్రతిభను వెలికితీసే వేదికలు మరింతగా రావాలని  అన్నారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ,  మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ సమాజానికి దిక్సూచి అవుతున్నారని పేర్కొన్నారు. ఫైనల్‌కు ఎంపికైన 30 మంది మహిళలు వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంప్రదాయ దుస్తులతో ర్యాంప్ వాక్ నిర్వహించి ఆకట్టుకున్నారు. పోటీలో ప్రసన్న విజేతగా నిలవగా, ఆయుషి మొదటి రన్నరప్, సుప్రియ రెండో రన్నరప్‌గా నిలిచారు. ఈ కార్యక్రమంలో పూజ చౌదరి, చీకోటి ప్రవీణ్, డాక్టర్ వేణుగోపాల్ రాజు, డాక్టర్ మాదాల నాగూర్, హరిహర కిరణ్, జ్యోతి కుమారి, పి ఎస్ శర్మ, జడ్జీలు, పోటీదారులు పాల్గొన్నారు.

Tags: