ఇందిరమ్మ రాజ్య పాలనలో అర్హులందరికీ న్యాయం

  • హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   

విశ్వంభర, హనుమకొండ: హనుమకొండ కలెక్టరేట్‌లో ఈరోజు నిర్వహించిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' జిల్లా స్థాయి సమావేశంలో వరంగల్ కుడా ఛైర్మన్, హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి , వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు , హనుమకొండ కలెక్టర్ ఛాహత్ బాజ్ పేయ్ తో కలిసి లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలను అందజేశారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి  మాట్లాడుతూ ప్రజా పాలనలో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందజేయడమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఐనవోలు, హాసన్ పర్తి మండలాలకు చెందిన 107 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. దివ్యాoగులకు ఎలెక్ట్రిక్ ట్రై సైకిల్స్ పంపిణీ చేస్తూ, సమాజంలో వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆడపిల్లల రక్షణ మన బాధ్యత అని  సమావేశంలో "బేటీ బచావో - బేటీ పడావో" పోస్టర్ ను ఆవిష్కరిస్తూ, బాలికల విద్య, రక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ ప్రగతి స్టాల్స్ ను ఎమ్మెల్యే, కలెక్టర్ లతో కలిసి ఇనగాల వెంకట్రామ్ రెడ్డి  సందర్శించారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/justice-for-all-deserving-under-the-rule-of-indiramma-rajya/article-15792

Tags: