క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు
విశ్వంభర, హనుమకొండ : క్యాన్సర్ చికిత్సా రంగంలో వస్తున్న సాంకేతిక ఆవిష్కరణలు రోగులకు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయని రేడియేషన్ టెక్నాలజీలు క్యాన్సర్ వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయని సీనియర్ రేడియేషన్ ఆంకాలజీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సునీత, రోబోటిక్ సర్జన్ డాక్టర్ ఇ. రాజేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం హన్మకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడతూ గతంలో లాగా పెద్ద కోతలు లేకుండా, కేవలం 8 ఎంఎం చిన్న రంధ్రాల ద్వారా హై-డెఫినిషన్ 3డి విజన్, మనిషి చేతి కదలికలను అనుకరించే వ్రిస్టెడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ సాయంతో క్లిష్టమైన ఆపరేషన్లను అత్యంత ఖచ్చితత్వంతో చేయవచ్చని డాక్టర్ రాజేష్ గౌడ్ తెలిపారు.వైద్య నిపుణులు డాక్టర్ ఎం. సునీత మాట్లాడుతూరేడియేషన్ అనగానే రోగుల్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ భయాలను దూరం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా యశోదా హాస్పిటల్స్ హైటెక్ సిటీలో "ఎంఆర్ లినాక్"' టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.ఈ అత్యాధునిక సాంకేతికతలు క్యాన్సర్ రోగులకు ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించి మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయని వైద్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో యశోదా హాస్పిటల్స్ హైటెక్ సిటీ టీమ్ లీడర్ సాయి వెంకట, డిప్యూటీ మేనేజర్ విజయ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.