సుధా బ్యాంకులో గుడిపూడి కి సన్మానం
విశ్వంభర, సూర్యాపేట: సుధా బ్యాంక్ ఆడిటోరియంలో లయన్స్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఇటీవల ఎన్నికైన గుడిపూడి వెంకటేశ్వరరావు ను సుధా బ్యాంకు పాలకవర్గం ఘనంగా సన్మానించడం జరిగింది. 52 సంవత్సరాల సుదీర్ఘ సూర్యాపేట లయన్స్ క్లబ్ చరిత్రలో ఒక లయన్ సభ్యుడు 8 జిల్లాలలో ఉన్న లయన్స్ క్లబ్బుల సముదాయానికి గవర్నర్ గా ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా సుధా బ్యాంక్ ఎండి పెద్దిరెడ్డి గణేష్ మాట్లాడుతూ గుడిపూడి వెంకటేశ్వరరావు ఎన్నిక కావడం సూర్యాపేట పట్టణంలో ఒక చారిత్రక సంఘటన. చిరకాలం గుర్తుండిపోయే గొప్ప విషయం అని చెప్పారు. సుధా బ్యాంక్ చైర్మన్ మీలా మహాదేవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ లయ న్స్ క్లబ్ సభ్యులు పుర ప్రముఖులు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల తో పాటు సుధా బ్యాంక్ వైస్ చైర్మన్ కక్కిరేణి చంద్రశేఖర్, డైరెక్టర్లు ఏపూరి శ్రవణ్ కుమార్, అప్పం శ్రీనివాస్, పటేల్ నరసింహారెడ్డి ,తోట శ్యాం ప్రసాద్, మీలా సందీప్, పోనుగోటి నిర్మల, బోనగిరి భాస్కర్, రాచర్ల కమలాకర్ ,ఇరిగి కోటేశ్వరి, గుండా లక్ష్మయ్య,తన్నీరు ప్రమీల తదితరులు పాల్గొన్నారు.