ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశంలో
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సూర్యాపేట జిల్లా పోలీస్ స్టాల్
- జిల్లా కలక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పి నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా యంత్రాంగం అధ్వర్యంలో పట్టణంలోని రవి మహాల్ ఫంక్షన్ హాల్ లో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 వేల కార్యాచరణలో భాగంగా ఆయా శాఖలు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు ప్రగతి అంశాల గురించి స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత ఉద్యమం, మహిళా భద్రతా, పిల్లల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ మోసాల నివారణ ప్రదర్శన అంశాలపై స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను జిల్లా కలక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పి నరసింహ జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. సైబర్ మోసాల నివారణ అవగాహన పోస్టర్, మహిళా భద్రత, రోడ్డు భద్రత పోస్టర్లను అవిష్కరించారు. పోలీస్ శాఖ చేపట్టిన అంశాల గురించి ఎస్పి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నిర్మూలన ప్రజలను మరింత చైతన్యవంతం చేయాలని తెలిపినారు. ప్రస్తుతం సమాజంలో పిల్లలను, యువతను, ప్రజలను, విద్యార్థులను గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను మన సమాజం నుండి కూకటి వేళ్ళతో వెలివేయాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది అన్నారు. ప్రజలకు అత్యాశ చూపి ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్నారని ఇలాంటి వారి పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు ఎవరైనా సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించినట్లయితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్స్ కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్, ఎస్పి అన్నారు. మహిళలు పిల్లల భద్రతలో భరోసా సెంటర్, షీ టీమ్స్, మానవ అక్రమ రవాణా నిరోధక టీం పటిష్టంగా పనిచేయాలని సూచించారు..jpeg)