హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల పేరుతో 15 లక్షలు టోకరా 

  • న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు

విశ్వంభర, బషీర్ బాగ్: అవుట్ సోర్సింగ్ లో హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఇప్పిస్తామని రాచా రాజేందర్, పాపాని శ్రీనివాస్ 15 లక్షలకు  పైగా వసూలు చేసి మోసం చేశారని బాధితులు పొలం ఐలయ్య, పొలం లక్ష్మీ, పొలం సత్య సాగర్, అది కర్ణాకర్, మామిడి సతీష్, తావిటి స్వాతి లు ఆరోపించారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడుతూ, ఎల్బీ నగర్లోని ఓ హోటల్లో  15 మంది నిరుద్యోగుల నుండి 1 లక్షచొప్పున వసూల్ చేసి నకిలీ నియామక పత్రాలు అందించి మోసం చేశారని ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  బాధితులందరూ నిరుపేద కుటుంబాలకు చెందినవారని చెప్పారు. ఉద్యోగం వస్తే జీవితంలో స్థిరపడవచ్చు అనే ఆశతో 9 రూ.లకు వడ్డీ లకు తీసుకొచ్చి డబ్బులు కట్టామని  అవి ఇప్పుడు మిత్తి కి మిత్తి అయ్యాయనీ తాము ఎలా అప్పులు చెల్లించాలో అర్థం కావడం లేదని బోరన విలపించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆత్మహత్యలే శరణ్యం అని హెచ్చరించారు. నారపల్లి హెల్త్ అసిస్టెంట్ గా ఉన్న పాపని శ్రీనివాస్ మేడ్చల్ మల్కాజిగిరి డిఎంహెచ్ఓ కార్యాలయంలో డిప్యూటేషన్ పై ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారని ఆయనపై ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పొన్నం వెంకటేశ్, మామిడి గంగారం, తావిటి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/15-lakhs-in-the-name-of-health-assistant-jobs/article-15809

Tags: