మధ్యవర్తిత్వం ద్వారా కలిసిన దాంపత్య జీవితం 

విశ్వంభర, మహబూబాబాద్ : వివాహం జరిగిన కొన్ని రోజులకే భార్య భర్తల మధ్య తలెత్తిన ఘర్షణల కారణంగా దూరంగా ఉంటున్న వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మధ్యవర్తిత్వం ద్వారా కలిశారు. మధ్యవర్తిత్వం న్యాయవాదులు తెలిపిన వివరాలు ప్రకారం. కేసముద్రం మండలానికి చెందిన ఎల్లోరి చరిత - ఫిలిప్ లకు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. తధనంతరం భార్యాభర్తల  మధ్య చిన్నచిన్న  మనస్పర్ధలు కారణంగా భార్య భర్త పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది.  కేసు మహబూబాబాద్ మెజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్ లో ఉండగా,   ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదిరే అవకాశాన్ని  గమనించిన మెజిస్ట్రేట్ కృష్ణ తేజ్  ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వ కేంద్రానికి పంపించడం జరిగింది. మధ్యవర్తిత్వ న్యాయవాదు లు  ఇరుపక్షాల కుటుంబ సభ్యులకు మరియు దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. మధ్యవర్తిత్వ న్యాయవాదుల కృషి తో మరియు ఇరుపక్షాల న్యాయవాదు ల సమక్షంలో దంపతులు కలిసి ఉండేందుకు అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/conjugal-life-reconciled-through-mediation/article-15811

Tags: