నగదు బదిలీ ద్వారా గొర్రెల పంపిణీ వెంటనే ప్రారంభించాలి

  • పశు సంవర్దక శాఖలో డిప్యూడేషన్లు రద్దు చేయాలి
    -జిఎంపియస్ జిల్లా అధ్యక్షుడు మద్దెపురం రాజు 

విశ్వంభర, గుండాల : గత అసెంబ్లీ ఎన్నికల మెనిపెస్టోలో 100 రోజుల్లో  రెండు లక్షల రూపాయల నగదు బదిలీ ద్వారా గొర్రెల పంపిణీ చేస్తామని గొల్ల కుర్మలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని గొర్రెల,మేకల పెంపందార్ల సంఘం  యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు   మద్దెపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గుండాల మండలం రామారం గ్రామం గొర్రెల మందల వద్ద గొర్రెల కాపరుల సమావేశం ఎర్రగొల్ల మహేష్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి హాజరైన మద్దెపురం రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం 2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకంలో రెండవ విడతగా గుండాల మండలంలో 890 యూనిట్లు రావాల్సి ఉందన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నగదు బదిలీ ద్వారా ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా అమలు చేయలేదని విమర్శించారు.వరుసగా ప్రభుత్వాలు గొల్ల కురుమలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి తప్ప హామీల అమలులో చిత్తశుద్ధి లేదన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకంలో ₹700 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందనే సాకుతో రెండున్నర సంవత్సరాల కాలంగా గొర్రెలు పంపిణీ నిలిపివేసిందని అన్నారు.అవినీతిపై విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.గొర్రెల మేకల పెంపకందారులు అనేక సంవత్సరాలు జిఎంపియస్ ఆధ్వర్యంలో పోరాడి సాధించుకున్న 559, 1016, 64 జీవోలను పటిష్టంగా అమలు చేయాలని,జిల్లా పశుసంవర్ధక శాఖలో ఉన్న ఖాళీగా 42 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని,ఇప్పటికే ఉన్న వెటర్నరీ డాక్టర్లు గొర్రెల కాపరులకు అందుబాటులో ఉండాలని,డిప్యూటేషన్లు రద్దు చేయాలని,పశు వైద్యశాలల్లో అమ్మతల్లి,చిటుక రోగానికి టీకాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.గొర్రెల కాపరుల సమస్యల పరిష్కారం కోసం గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం కృషి చేస్తుందని తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలలో తమ వాటా కోసం గొల్ల కుర్మలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో దొడ్డెబోయిన దయాకర్,ముక్కాముల పెద్దులు,ముక్కెర యాదయ్య,మాదరబోయిన బిక్షం,ముక్కెర కొండయ్య, ఎర్రగొల్ల మల్లేష్,రాజు పాల్గొన్నారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-sheep-through-cash-transfer-should-start-immediately/article-15785

Tags: