ప్రజలకు మేలైన పాలన అందించాలన్నదే లక్ష్యం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
విశ్వంభర, వికారాబాద్: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ దీపక్ తివారీ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజలకు మరింత మేలైన పాలన అందించాలనే లక్ష్యంతో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి,వాటి పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని తెలిపారు. ప్రజాపాలన పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో పారిశుధ్యం, ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత, సంక్షేమం, పిల్లల రక్షణ, డ్రగ్స్ నిర్మూలన, రైతు సంక్షేమం వ్యవసాయం, విద్య, యువత క్రీడలు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అధికారులు మరింత శ్రద్ధ వహించి ప్రభుత్వ ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు.