నాలుగేళ్లకే భక్తి భావం.. చిన్నారి హర్షిత ప్రతిభకు ప్రశంసలు
విశ్వంభర, హైదరాబాద్ : నేటి కాలంలో చిన్నారులు మొబైల్ ఫోన్లు, కార్టూన్ల ప్రపంచంలో ఎక్కువగా మునిగిపోతున్న వేళ.. నాలుగేళ్ల చిన్నారి తన మధుర గాత్రంతో భక్తి గీతాలు ఆలపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. “పిట్ట కొంచెం.. కూత ఘనం” అనే సామెతకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది చిన్నారి హర్షిత. ప్రస్తుతం ఎల్‌కేజీ చదువుతున్న హర్షిత.. చిన్న వయసులోనే మణిదీప వర్ణనలోని 32 శ్లోకాలను కంఠస్థం చేసి అనర్గళంగా పాడుతోంది. అంతేకాకుండా హనుమాన్ చాలీసా, లింగాష్టకం, భగవద్గీతలోని రెండు అధ్యాయాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత గీతం తదితర భక్తి గేయాలను సులభంగా ఆలపిస్తూ భక్తి పరవశంలో ముంచెత్తుతోంది. హర్షిత తల్లిదండ్రులు సాయి ఫణికుమార్, లక్ష్మి తరంగిణి ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగాలు నిర్వహిస్తున్నప్పటికీ.. ఇంట్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూజలు, భజనలు, దేవుని ఆరాధనకు ప్రాధాన్యత ఇస్తుంటారు. చిన్నప్పటి నుంచే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో తల్లి లక్ష్మి తరంగిణి ఖాళీ సమయాల్లో హర్షితకు భక్తి గీతాలను అర్థంతో సహా నేర్పించారని తెలిపారు. తల్లి చెప్పిన ప్రతి శ్లోకాన్ని ఆసక్తిగా వింటూ, అతి తక్కువ సమయంలోనే కంఠస్థం చేసుకోవడం హర్షిత ప్రత్యేకతగా మారింది. ప్రస్తుతం ఆమె హిందుస్థానీ సంగీతంలో కూడా శిక్షణ పొందుతోంది. దేవాలయాలకు వెళ్లినప్పుడు అక్కడ భజనలు ఆలపిస్తూ భక్తులను ఆకట్టుకుంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చిన్నారి హర్షిత ప్రతిభను చూసిన బంధువులు, సన్నిహితులు, భక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సనాతన ధర్మం, భారతీయ ఆచార వ్యవహారాలు చిన్నతనం నుంచే పిల్లలకు నేర్పిస్తే భవిష్యత్ తరాలకు మంచి విలువలు అందుతాయని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.