బండ్లగూడలో నూతన ఆరాధన మందిరం ప్రారంభం
: పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్
విశ్వంభర, సంగారెడ్డి: పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని జేపీ కాలనీ డివిజన్, బండ్లగూడ జీఎంఆర్ మార్గ్ కాలనీలో నూతనంగా నిర్మించిన "మారా ఆరాధన మందిర" మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, ఎండీఆర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు మాద్రి పృథ్వీరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పృథ్వీరాజ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. దైవకృపతో నిర్మితమైన ఈ ఆరాధన మందిరం విశ్వాసులకు ఆధ్యాత్మిక కేంద్రంగా, ఆశీర్వాద నిలయంగా నిలవాలని ఆకాంక్షించారు. దేవుని ప్రేమ, శాంతి ప్రతి కుటుంబంలో నిండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మందిర అభివృద్ధికి, విశ్వాసుల సేవలో తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, సంఘ పెద్దలు, విశ్వాసులు, స్థానిక క్రైస్తవ సోదరులు, ఎంపీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.