బెల్టు షాపులను వదిలారు కిరాణా షాపును పట్టారు…

  •  జోరుగా బెల్టు షాపుల సిండికేట్ దందా*
  • మామూళ్ళ మత్తులో ఎక్సైజ్‌ శాఖ అధికారులు

 విశ్వంభర,  ఉమ్మడి,నిజామాబాద్ జిల్లా:-  మోపాల్,మండల కేంద్రంలో బెల్టు షాపుల సిండికేట్ దందా జోరుగా కొనసాగుతుంది. కేవలం మోపాల్ మండలం మొత్తంలో బెల్ట్ షాప్స్ కిరాణా షాప్స్ లలో మద్యం ఏరులై పారుతుంది. 18 సంవత్సరాలు లోపు పిల్లలకు మద్యం విక్రయిస్తున్నట్లు. బెల్ట్ షాప్ నిరువాకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. గ్రామంలోని టెన్ టూ టెన్ లిక్కర్ వైన్స్ షాపు  వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి బెల్ట్ షాపులకు మద్యం విక్రయిస్తూ అక్రమ లాభాలను అర్జిస్తున్నారు. ఒక్కో కోటర్ బాటిల్, ఒక్కో బీరు బాటిల్ పై ఎమ్మార్పీ ధరల కంటే 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. అదేవిధంగా బ్లూ ప్రింట్ లో ఉన్న ఆధారంగా పర్మిట్ రూమ్ కొనసాగాల్సి ఉండగా, బ్లూ ప్రింట్ కు విరుద్ధంగా వైన్స్ ప్రక్కన అక్రమంగా షెడ్డు ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు.ఇంత జరుగుతున్నా ఎక్సెజ్ శాఖ అధికారులు మాత్రం వైన్స్ షాపుల యజమానుల పై, బెల్టు షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకోకుండా మౌనం ఎందుకోనని పలువురు ప్రశ్నించుకుంటున్నారు. ఈ మద్యం దందాను అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు తమకేమీ పట్టనట్లుగా మామూళ్ళ మత్తులో మునిగి తెలుతున్నారనే ఆరోపణలు గుప్పు మంటున్నాయి. ఇటీవల మండలంలో ఎక్సైజ్‌ అధికారులు అనుమానం ఉన్న బెల్టుషాపుల్లో తనిఖీలు చేశారు. మండలంలోని వైన్స్ లోనే మద్యం కొనుగోలు చేయాలని, లేదంటే సీజ్‌ చేస్తామని ఎక్సైజ్‌ అధికారులు హెచ్చరించినట్లు తెలిసింది. మండల కేంద్రంలో వైన్స్ నిర్వాహకులు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూన్నారని, బెల్ట్ షాపులను ఆశ్రయించడం వల్ల ఒక మద్యం బాటిల్ పై రూ. 10 నుంచి రూ 20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని మద్యం ప్రియుల నుంచి ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మండలంలో ఉన్న వైన్స్ షాపు సిండికేట్ అయ్యి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ బెల్ట్ షాపుల ద్వారా మద్యం ప్రియుల జేబులను ఖాళీ చేస్తున్నారని పలువురు స్ధానికులు ఆరోపిస్తున్నారు.

– వైన్స్, బెల్టు షాపుల పై ఎక్సైజ్ అధికారుల మౌనం..

Read More జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

 మండల కేంద్రంలో వైన్స్ యజమానుల సిండికేట్ వ్యాపారాన్ని చూస్తూ కూడా ఎక్సెజ్ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.  అయితే అధిక ధరలకు మద్యం అమ్మకాల విషయంలో సీరియస్ గా ఉండాల్సిన ఎక్సెజ్ అధికారులు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. బెల్ట్ షాపుల నిర్వహణను, అధిక ధరలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఎక్సెజ్ శాఖ హెచ్ఎచ్ఓ స్వప్న మాట్లాడుతూ 18 సంవత్సరాలలోపు ఎక్కడైనా మద్యం వైన్స్ షాపులో కానీ బెల్ట్ షాపుల్లో కానీ విక్రయిస్తే వెంటనే మాకు సమచారం ఇవ్వండి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. మద్యం షాపులపై ఫిర్యాదులు అందుతున్నాయి. కచ్చితంగా మద్యం చిన్నారులచే విక్రయించే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు.

🕒 11 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/illegal-construction-of-shed-next-to-vines-against-blue-print/article-15289

Tags: