జాతీయ రహదారి వద్ద పగిలిన మంజీర పైప్‌లైన్

  • షాపుల్లోకి చేరిన నీరు.. భారీగా నష్టం
  • కాలనీల్లో కలుషిత నీటి సరఫరాపై స్థానికుల తీవ్ర ఆందోళన
  • జలమండలి అధికారులను నిలదీసిన పరమేష్ యాదవ్, కాలనీవాసులు

విశ్వంభర, సంగారెడ్డి:  రామచంద్రపురం డివిజన్ పరిధిలో తాగునీటి సమస్యలు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. గురువారం రాత్రి జాతీయ రహదారి సమీపంలో మంజీర వాటర్ పైప్‌లైన్ ఒక్కసారిగా పగిలిపోవడంతో భారీగా నీరు వృథాగా ప్రవహించింది. వరదలా దూసుకొచ్చిన నీరు పక్కనే ఉన్న ఒక వ్యాపార సముదాయం (షాపు) లోకి పూర్తిగా చేరడంతో సరుకులు నానిపోయి భారీగా నష్టం వాటిల్లింది. అధికారుల నిర్లక్ష్యంపై స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పైప్‌లైన్ పగిలిన నేపథ్యంలో నేడు నాయకులు, కాలనీవాసులు జలమండలి  అధికారులను సంఘటనా స్థలానికి పిలిపించి పరిస్థితిని ప్రత్యక్షంగా చూపించారు. డివిజన్ వ్యాప్తంగా సరైన మంచినీటి సరఫరా లేకపోవడం, ఒకవేళ నీరు వచ్చినా అది తరచుగా కలుషితంగా ఉండడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా పరమేష్ యాదవ్ మాట్లాడుతూ జలమండలి అధికారుల నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు శుద్ధమైన మంచినీటిని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా తయారైంది. తాగునీటిలో మురుగునీరు కలవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడటమే" అని ఆయన మండిపడ్డారు.అలాగే, పైప్‌లైన్ పగిలిన సందర్భాల్లో కాలయాపన చేయకుండా వెంటనే స్పందించి, ప్రత్యామ్నాయంగా ఉచిత ట్యాంకర్ల ద్వారా కాలనీలకు నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి నగర్ కాలనీ మాజీ అధ్యక్షుడు పెంట రెడ్డి, జైపాల్ రెడ్డి, నారాయణ, రాజు, భూపాల్ రెడ్డి, మురళి రెడ్డి, రాంబాబు, అప్పల భాస్కర్, బలరాం, నాగేష్‌లతో పాటు కాలనీవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అధికారులకు తమ సమస్యలను విన్నవించారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/manjira-pipeline-burst-at-national-highway/article-15736

Tags: