ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా రెవెన్యూ అధికారులు
- ప్రభుత్వ భుములు అక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
:ఎమ్మార్వో అమరలింగం
విశ్వంభర, శంషాబాద్: శంషాబాద్ మండల పరిధిలోని ఎయిర్‌పోర్ట్ కాలనీ సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 626/1లోని సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా, రెవెన్యూ శాఖ అధికారులు కబ్జాదారుల నుండి విడిపించారు. కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమిపై ఇటీవల అక్రమ నిర్మాణాలు చేపట్టిన విషయం వెలుగులోకి రావడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. తహసీల్దార్ అమరలింగం గౌడ్ ఈ విషయం గమనించి వెంటనే హైడ్రా అధికారులకు సమాచారం అందించారు. అనంతరం పూర్తి వివరాలు సేకరించి పరిశీలించిన అధికారులు రెవెన్యూ సిబ్బంది, హైడ్రా బృందం , భారీ పోలీస్ బలగాలతో కలిసి గురువారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకోని అక్కడే నిర్మించిన నిర్మాణాలు, తాత్కాలిక షెడ్లు, ఇతర నిర్మాణాలను జేసీబీ యంత్రాల సహాయంతో కూల్చివేశారు. ఈ చర్యల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. అధికారులు స్పష్టం చేస్తూ, ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. భూకబ్జాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూమి విలువ కోట్ల రూపాయల్లో ఉండటంతో దానిని కాపాడటం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు ప్రభుత్వ స్థలాలను ఎవరైనా ఆక్రమించిన కట్టడాలు నిర్మించిన వారిపై క్రిమినల్ కేసులతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.