కొనాయపల్లిలో డ్వాక్రా మహిళల భవన నిర్మాణానికి భూమిపూజ

విశ్వంభర, కేశేంపేట్:  కేశంపేట్ మండల పరిధిలోని కొనాయపల్లి గ్రామంలో డ్వాక్రా మహిళల భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సొప్పరి ధనలక్ష్మి రామకృష్ణ  కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, మహిళల అభివృద్ధి, సాధికారతకు డ్వాక్రా భవనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాలు మరియు సామాజిక సేవా కార్యక్రమాలకు ఈ భవనం కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధికి మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ భవన నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ హనుమంత్ నాయక్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bhumi-puja-for-construction-of-dwakra-womens-building-at-konayapally/article-15827

Tags: