జూన్ 15 నుంచి అక్టోబర్ 1 వరకు “సర్” ప్రక్రియ

  • ప్రత్యేక మ్యాపింగ్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు

విశ్వంభర , భద్రాచలం: భారత ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా చేపడుతున్న మూడవ దశ "సర్"  షెడ్యూల్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో జూన్ 15వ తేదీ నుండి అక్టోబర్ 01వ తేదీ వరకు ప్రత్యేక ఓటరు నమోదు, ధృవీకరణ,మ్యాపింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు 119 (ఎస్టీ) భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట తెలిపారు. శుక్రవారం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రజల ఓటు హక్కు రక్షణకు ఎన్నికల కమిషన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో పొరపాట్లు, డూప్లికేట్ నమోదులు, చిరునామా మార్పులు, మరణించిన వారి పేర్లు తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ ప్రత్యేక "సర్" ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్‌లో ప్రత్యేకంగా "సర్ మ్యాపింగ్ హెల్ప్ డెస్క్" ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ హెల్ప్ డెస్క్ పని దినాలలో ప్రతిరోజూ ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిరంతరం పనిచేస్తుందని చెప్పారు. ప్రతి ఓటరు తమ ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు తీసుకుని హెల్ప్ డెస్క్‌ను సంప్రదించి తమ వివరాలను ధృవీకరించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి చిరునామా, వయస్సు, పోలింగ్ స్టేషన్ వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. అదేవిధంగా కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రతి భారత పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకు కీలక బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ మండలాలు, దూర ప్రాంత గిరిజన గ్రామాల్లో నివసించే ప్రజలు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని అధికారులు ప్రత్యేకంగా కోరారు. ఎవరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా ముందస్తుగా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే అన్ని వివరాలను సరిచేయడం అత్యంత అవసరమని తెలిపారు. ముఖ్యంగా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మారిన వారు, కొత్తగా వివాహం అయిన మహిళలు, ఉద్యోగరీత్యా చిరునామా మారిన వారు తమ వివరాలను నవీకరించుకోవాలని సూచించారు.
ప్రజల్లో ఎన్నికలపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అవసరమైతే బూత్ స్థాయి అధికారుల సహకారంతో గ్రామ గ్రామాన ప్రచారం చేపట్టి ప్రజలకు సమాచారం అందజేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రతి ఓటరు  సమాచారం సక్రమంగా నమోదు కావడం ద్వారా పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా హెల్ప్ డెస్క్‌ను సంప్రదించి సేవలు పొందవచ్చని తెలిపారు. అవసరమైన సమాచారం, మార్గదర్శకాలు మరియు సహాయం కోసం ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఇతర వివరాల కోసం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలకార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్ 08743-232444 ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/%E2%80%9Csir%E2%80%9D-process-from-june-15-to-october-1/article-15804

Tags: