పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ - మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు
విశ్వంభర, చండూరు: సోమవారం నాడు స్థానిక ప్రభుత్వ అతిథి గృహం నందు 3,85,500/- రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను చండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ మరియు కౌన్సిలర్లు అందరు కలిసి 13 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తుందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారి కృషితో అనేకమంది పేద కుటుంబాలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నాయని అన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోడి సుష్మా వెంకన్న, బుషిపాక వాసు, కటకం రమేష్, కో ఆప్షన్ సభ్యులు కల్లెట్ల చంద్రకళ మారయ్య, ఖలీల్, మొగుదాల వెంకన్న, షరీఫ్, ఐతరాజు మల్లేష్,బోడ వెంకటేష్, నల్ల సత్యనారాయణ, ఇరిగి వెంకటేశం, పన్నాలు లింగయ్య,పందుల సత్యం, గంట యాదయ్య,మాస కృష్ణ, జూలూరు వెంకటేశం,లతీఫ్, ఏకాలపు ఆంజనేయులు, ఇరిగి శంకర్, రావిరాల రాజు, బుషిపాక సురేష్ తదితరులు పాల్గొన్నారు.