డిండి వ్యవసాయ మార్కెట్‌లో తడిసి ముద్దవుతున్న ధాన్యం
విశ్వంభర, డిండి: డిండి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లు రవాణా ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మార్కెట్ కమిటీ అధికారుల నిర్లక్ష్యం, రవాణా కాంట్రాక్టర్ల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .మార్కెట్ యార్డులో ఓపెన్ ప్లాట్‌ఫారాలపై ఉన్న వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది సరైన కవర్లు అందుబాటులో లేకపోవడ ఎగుమతి వేగంగా జరగకపోవడంతో రైతులు కళ్లముందే తమ పంట నీటిపాలు కావడం చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. తడిసిన ధాన్యానికి రంగు మారి, మొలకలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు. పదుల సంఖ్యలో లారీల ధాన్యం వస్తున్నవి రెండే ప్రస్తుతం డిండి మార్కెట్ యార్డులో దాదాపు 30 లారీలకు సరిపడా భారీ మొత్తంలో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. రోజు రోజుకూ రైతులు తెస్తున్న ధాన్యంతో మార్కెట్ కిక్కిరిసిపోతోంది. ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం ఉన్నప్పటికీ, ఇక్కడి నుండి కేవలం రోజుకు 2 లేదా 3 లారీలలో మాత్రమే ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతులకు న్యాయం చేయాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమం లో పి ఏ సి ఎస్ చైర్మన్ మాధవరం శ్రీనివాస రావు, సర్పంచ్ మల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, తిరుపతయ్య, చంద్రయ్య గౌడ్,రషీద్, సురేష్, మల్లయ్య, భాస్కర్, జయవర్ధన్, బాసీత్, శ్రీను, శ్రీనయ్య, వెంకటయ్య, అంకల్, రాములు, శ్రీను, భాస్కర్, బాలు, ధన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.