సరస్వతి పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

  • : వీసీ అండ్ ఎండీ వై.నాగిరెడ్డి 

విశ్వంభర,  జిహెచ్ఎంసి  : ​ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (వీసీ అండ్ ఎండీ) వై.నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మే  నుండి జూన్ 1వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించేందుకు కాళేశ్వరానికి వెళ్లే భక్తులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా, వారి ప్రయాణం సురక్షితంగా మరియు సుఖవంతంగా సాగేలా అధునాతన బస్సులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ కింద ఈ ప్రత్యేక రవాణా సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ​భక్తుల రద్దీ మరియు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల నుండి కాళేశ్వరానికి ఈ ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాయని ఎండీ స్పష్టం చేశారు. హైదరాబాద్, నర్సంపేట, తొర్రురు,  భూపాలపల్లి, మణుగూరు, కరీంనగర్, మంథని, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, పరకాల, నిజామాబాద్, గోదావరిఖని, మరియు మంచిర్యాల వంటి ముఖ్య ప్రాంతాల నుండి నేరుగా కాళేశ్వరానికి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులు మరియు భక్తుల సౌకర్యార్థం ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక సంప్రదింపు నంబర్లను కూడా సంస్థ విడుదల చేసిందని, హైదరాబాద్ భక్తులు సమాచారం కోసం 9959226245 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు. ​అదేవిధంగా నర్సంపేట (9959226293), తోరూర్ (9959226053), భూపాలపల్లి (9959226707), మణుగూరు (9959225963), కరీంనగర్ (9959225920), మంథని (9959225923), హన్మకొండ (9959226049), మహబూబాబాద్ (9959226054), జనగాం (9959226050), పరకాల (9959226051), నిజామాబాద్ (9959226016), గోదావరిఖని (9959225922), మంచిర్యాల (9959226004) నంబర్లలో సంప్రదించి బస్సుల వేళలు, ఇతర వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు. పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ల కొరకు టీజీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ www.tgsrtcbus.in ద్వారా తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. భక్తులందరూ ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను వినియోగించుకుని, సురక్షితమైన వాతావరణంలో కాళేశ్వర సరస్వతి పుష్కరాల యాత్రను విజయవంతం చేసుకోవాలని వీసీ అండ్ ఎండీ వై.నాగిరెడ్డి కోరారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/rtc-special-buses-to-saraswati-pushkara/article-15821

Tags: