అగ్ని ప్రమాదంలో దగ్ధమైన నిమ్మతోట
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇస్కిళ్ళ గ్రామానికి చెందిన రైతు గన్నేబోయిన విజయభాస్కర్ తన సొంత వ్యవసాయ భూమిలోని నిమ్మ తోటలో సుమారుగా 90 నిమ్మ చెట్లు పెట్టి గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేస్తుండగా శుక్రవారం రోజు ఉదయం ప్రమాదవశాత్తు నిప్పు తగిలి తోటలో సుమారుగా 45 చెట్లు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని కొంతమేరకు ఆర్పివేయగా మిగిలిన చెట్లు అగ్నికి ఆహుతి కావడం జరిగింది. అగ్ని ప్రమాదంలో దగ్ధమైన నిమ్మతోట రైతును ప్రభుత్వ యంత్రాంగం ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం ఆధ్వర్యంలో ఘటన స్థలాన్ని పరిశీలన చేసి మాట్లాడుతూ, అగ్ని ప్రమాదానికి 45 చెట్లు దగ్ధం కావడంతో రైతుకు తీవ్ర నష్టం జరుగుతుందని, సుమారుగా ఆ సంవత్సరానికి ఒక చెట్టు పదివేల రూపాయల పంట వస్తుందని దీని మూలంగా రైతు నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. జిల్లా ఉద్యానవన అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేసి రైతుకు ప్రతీ చెట్టుకు 25వేలు నష్టపరిహారం అందించాలని అన్నారు. క్రాప్ లోన్ పూర్తి స్థాయిలో మాఫీ చేసి తిరిగి మళ్ళీ ఇవ్వాలని, ఉచితంగా చెట్ల పంపిణి చేసి పురుగు మందులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జల్లెల పెంటయ్య, మాజీ నీటి సంఘం చైర్మన్ మేడబోయిన శ్రీనివాస్, పల్లె సత్యం, మార్త భూపాల్ రెడ్డి, గన్నేబోయిన సింహాచలం, చిన్నబోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.