నిజమైన ఉద్యమకారులను గుర్తించాలి
విశ్వంభర, అంబర్ పేట : తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన నిజమైన ఉద్యమకారులను గుర్తించాలని హైదరాబాదు అంబర్ పేట జేఏసీ కన్వీనర్ రూబీ స్టీవెన్సన్ అంబర్పేట్ డిప్యూటీ తాసిల్దార్ బలరాంకు వినతి పత్రం సమర్పించారు. గురువారం అంబర్పేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ పార్టీలకు అతీతంగా పనిచేసి నిజమైన ఉద్యమకారులకు సరైన గుర్తింపు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కుల, మత భేదాలకు అతీతంగా ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉద్యమంలో పాల్గొన్న వారి వివరాలను సమగ్రంగా సేకరించి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చూడాలని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా నిజమైన ఉద్యమకారులకు 250 గజాల స్థలం, 25 వేల రూపాయల పెన్షన్, హెల్త్ కార్డు, గుర్తింపు పత్రాలు ఇవ్వాలని వినతి పత్రంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు వర్కాల శ్రీకాంత్, రవీందర్, భాను దాస్, అమర్ తదితరులు పాల్గొన్నారు.