బాల్యవివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ  కృషి చేయాలి

  • పంట మార్పిడి విధానం ద్వారా రైతులకు అధిక లాభాలు
  • ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిలో రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా 6వ స్థానం
  • మక్కజొన్న, వరిధాన్యం కొనుగోలు తరలింపులో రికార్డు స్థాయిలో జిల్లా
  • జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్

WhatsApp Image 2026-05-22 at 10.32.08 PM

Read More జనగణన పై చిన్ననాగారంలో కళాప్రదర్శన

విశ్వంభర, మహబూబాబాద్:  శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పీఎస్ఆర్ కన్వెన్షన్ హాలులో  ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి ప్రజా పాలన సమావేశం ఇన్చార్జి అదనపు కలెక్టర్  అధ్యక్షతన నిర్వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్. హాజరయ్యారు. సభా ప్రాంగణం లో రెండు పడకల గదుల నిర్మాణం, ఆయిల్ పామ్, వ్యవసాయ, పరిశ్రమలు వైద్య ఆరోగ్యశాఖ, ఇండియన్ రెడ్ క్రాస్, చేనేత వస్త్రాల, తదితర శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేరువగా పాలన అందించడానికి క్షేత్రస్థాయిలో జవాబుదారితనం పారదర్శకత తో కూడిన మెరుగైన పాలనను ప్రజా అభిప్రాయానికి ప్రత్యేకించి నిరుపేద అణగారిన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు సామాజిక న్యాయ ఆర్థిక సాధికారిక లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక దరఖాస్తులు డిజిటలైజ్ చేసి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం నుండి ఆదేశాలు రాగానే మంజూరుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిలో రాష్ట్రంలో జిల్లా ఆరవ స్థానంలో ఉందని, మిగిలిన లక్ష్యాలను వెంటనే పూర్తి చేయుటకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఐదవ స్థానంలో జిల్లా ఉందని, ఇంటర్మీడియట్ , వృత్తివిద్య కోర్సులపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు సాగుతామని అన్నారు. స్వీయ గణన, ఇండ్ల గణన సర్వేలు జిల్లా ప్రణాళిక ప్రకారం సర్వే కొనసాగుతుందని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ వివరాలను ఇవ్వాలని కోరారు, ఎస్ఐఆర్ మ్యాపింగ్లో వేగంగా జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పంట మార్పిడి విధానం పై రైతులకు అవగాహన కల్పించాలని, ఇతర వాణిజ్య పంటలు పామ్ ఆయిల్, తప్పు దినుసులు, సేంద్రీయ వ్యవసాయం, ఎరువులు, సెరికల్చర్, హార్టికల్చర్, పంటలపై రైతులకు అధిక లాభాలు వస్తాయని ఆ దిశగా రైతులు ముందుకు సాగాలన్నారు. యూరియా అధిక వాడకం వలన భూమి సారవంతం కోల్పోయి రైతులకు నష్టం కలుగుతుందని, నానో యూరియా సేంద్రియ ఎరువులు వాడాలన్నారు. జిల్లాలో గంజాయి డ్రగ్స్ మత్తుపదార్థాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకొని స్పెషల్ టీంలలో ఏర్పాటు చేయడం జరిగిందని, యువత బానిసలు కాకుండా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు, మత్తు పదార్థాల అమ్మకం నిలువలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బాల్య వివాహాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకొని జిల్లా స్పెషల్ టీం నిరంతరం నిఘా పెట్టడం జరిగిందని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివిస్తే మంచి ఉద్యోగాలు వస్తాయని, తద్వారా కుటుంబ పోషణ బాధ్యతలు చూసుకోవడం జరుగుతుందని అన్నారు అందుకే ఆడపిల్లలకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలని తెలిపారు, మే 18 నుండి 23 వరకు యువత క్రీడోత్సవం కొనసాగుతుందని, మే 25 నుండి 30 వరకు మహిళలందరికీ స్వయం సహాయక బృందాల సభ్యులకు పొదుపు చర్యలు తదితర అంశాలపై అవగాహన, జూన్ 1 నుండి 12 వరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో తీసుకోవలసిన చర్యలు నర్సరీలు పెంచడం, పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాల నిర్వహణ విజయవంతనికి ఇప్పటికే జిల్లా అధికారులకు పూర్తి బాధ్యతలు అప్పగించి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, (ఇన్చార్జి) అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పిడి హౌసింగ్ జెడ్పి సీఈవో పురుషోత్తం,మహబూబాబాద్, తొర్రూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు క్రిష్ణవేణి, గణేష్, డీఎస్పీ తిరుపతిరావు, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, మహబూబాబాద్, డోర్నకల్, కేసముద్రం, మరిపెడ మున్సిపల్ చైర్పర్సన్లు, జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు, స్వయం సహాయక బృందాలు, జిల్లాలోని అందరూ ఎంపీడీవోలు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/everyone-should-work-to-prevent-child-marriage/article-15817

Tags: