ధాన్యం అన్‌లోడింగ్, పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

  • పెద్దపల్లి రైల్వే స్టేషన్ ​లోని యూరియా రాక్ పాయింట్, పెద్దపల్లి మార్కెట్ యార్డ్‌ను పరిశీలించిన కలెక్టర్

విశ్వంభర, ​పెద్దపల్లి : పెద్దపల్లి లోని రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన  రాక్ పాయింట్  నుంచి యూరియా సప్లై ,​ స్థానిక వ్యవసాయ మార్కెట్ లోని ధాన్యం అన్‌లోడింగ్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం పెద్దపల్లి లోని రైల్వే స్టేషన్ వద్దగల యూరియా రాక్ పాయింట్ ను, వ్యవసాయ మార్కెట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ అవసరాలకు తగ్గట్టుగా రాక్ పాయింట్ వద్ద ఉన్న యూరియాను లారీలు, హమాలీ కార్మికులను సమకూర్చుకొని త్వరగా జిల్లా వ్యాప్తంగా సప్లై చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి మార్కెట్ యార్డుకు రైతులు తీసుకొస్తున్న ధాన్యం అన్‌లోడింగ్ పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే చేపట్టాలని సూచించారు. లారీల కొరత రాకుండా చూసుకోవడంతో పాటు, పనులకు ఆటంకం కలగకుండా తగినంత మంది హమాలీ కార్మికులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ​ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ  శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/district-collector-koya-shri-harsha-should-speed-up-the-unloading/article-15771

Tags: