జిల్లా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

జిల్లా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

  •  కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌ పవార్  
     మహిళా సంఘాల భవనాలకు వెంటనే నిధులు మంజూరు
     క్షేత్రస్థాయిలో రూ.10 లక్షలతో షెడ్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలి
     దివ్యాంగ పిల్లల కోసం 342 ప్రత్యేక పరికరాల పంపిణీ

విశ్వంభర, సూర్యాపేట: జిల్లా సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం క్షేత్రస్థాయి అధికారులు సమష్టి ఆలోచనలతో, కలిసికట్టుగా పని చేస్తూ జిల్లాను ముందంజలో నిలపాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌ లాల్‌ పవార్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి నివేదికపై నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశం స్థానిక రవి మహల్ లో నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. మండల, జిల్లా స్థాయి అధికారులు ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారికి తోడుగా ఉంటారని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో మహిళా సంఘాలకు స్వంత భవనాలు లేకపోతే, సంబంధిత ఎంపీడీఓ ద్వారా తగిన ప్రతిపాదనలు  పంపించాలని, అలా వచ్చిన ప్రతిపాదనలకు వెంటనే నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 370కి పైగా భవనాల ప్రతిపాదనలు వచ్చాయని, వాటిలో ఇప్పటికే 200 మహిళా సంఘ భవనాలకు గ్రౌండింగ్ పూర్తి చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా, క్షేత్రస్థాయిలో మహిళల సౌకర్యార్థం రూ.10 లక్షల వ్యయంతో షేడ్స్  నిర్మించుకునే అవకాశం ఉందని, వీటి కోసం కూడా త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని 50 మంది ప్రత్యేక అవసరాలు గల  పిల్లల కోసం రూపాందించిన 342 ప్రత్యేక పరికరాలను  అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరికరాలను ప్రత్యేకంగా 'అలింకో' కంపెనీ ద్వారా నాణ్యతా ప్రమాణాలతో తయారు చేయించినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌ కోరారు. అనంతరం ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ మారకద్రవ్యాలను కూకటివేళ్లతో పెకలించాలని  పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా సమాజంలో యువతను, విద్యార్థులను పట్టిపీడిస్తున్న గంజాయి లాంటి మాదకద్రవ్యాలను కూకటివేళ్లతో పెకలించి వేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగాపనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకుని ఆర్థికంగా దోచుకుంటున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని  ప్రజలకు సూచించారు. మహిళలు, పిల్లల రక్షణ కోసం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్లు, షీ టీమ్స్, మరియు మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలు మరింత పటిష్టంగా పనిచేస్తూ బాధితులకు అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అనంతరం ప్రజా పాలన ప్రగతి నివేదికలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ ఇతర ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సైబర్ మోసాల నివారణ, మహిళా భద్రత, రోడ్డు భద్రతకు సంబంధించిన ప్రత్యేక అవగాహన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. పోలీస్ శాఖ తరఫున క్షేత్రస్థాయిలో చేపడుతున్న వివిధ సేవా, రక్షణ కార్యక్రమాలను ఎస్పీ నరసింహ కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ మరణించిన ఇద్దరు ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామక ఆర్డర్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి హరిసింగ్, పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, డి ఆర్ డి ఓ పి డి సన్యాసయ్య, జడ్పీ సీఈవో శిరీష, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, సిపిఓ కిషన్,  డి ఎస్ సి డి ఓ దయానందరాణి, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంత్ రెడ్డి ఇతర జిల్లా అధికారులు, సర్పంచులు, డ్వాక్రా మహిళలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-aim-is-the-development-and-welfare-of-the-district/article-15743

Tags: