టాడి మ్యూజికల్ ఫెస్టివల్‌ను వెంటనే నిలిపివేయాలి

  • గీతా వృత్తి జోలికి వస్తే సహించం : బాలగౌని బాలరాజ్ గౌడ్

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: టాడి మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతో గీతా వృత్తిపై కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ గౌడ్ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ పేర్కొన్నారు. వెంటనే టాడి మ్యూజికల్ ఫెస్టివల్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. కల్లుగీత వృత్తిపై కార్పొరేట్ శక్తులు కన్నేశాయని, ఈ వృత్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తరతరాలుగా గీతా వృత్తిపై కుట్రలు జరుగుతు న్నాయని ఆరోపించారు. వృత్తిని కబ్జా చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. కొంతమంది ముఖ్యమంత్రిని తప్పుదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. గౌడ్ కులానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించి వృత్తిని కాపాడాలని కోరారు. సమన్వయ కమిటీ కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా వృత్తిపరమైన దాడులు జరుగుతున్నాయని అన్నారు. గౌడ్ కుల వృత్తిని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే సహించబోమన్నారు. తెలంగాణ ఏర్పడి పన్నెండేళ్లు దాటినా సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని పేర్కొన్నారు. గౌడ్ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్ మాట్లాడుతూ తమ కుల వృత్తిలో జోక్యం చేసుకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. టాడి మ్యూజికల్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గీతా వృత్తిదారులకు అందాల్సిన ప్రయోజనాలు అందడం లేదన్నారు. జై గౌడ్ అధ్యక్షుడు వట్టికూటి రామరావు గౌడ్ మాట్లాడుతూ గౌడ్ అస్థిత్వానికి ముప్పు వాటిల్లితే పార్టీలకతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్. దుర్గయ్య గౌడ్, గడ్డమీది విజయకుమార్ గౌడ్, ముద్దగోని రాంమోహన్ గౌడ్, బైరు శేఖర్, ఆనంద్ గౌడ్, జంగంరావు గౌడ్, సత్యం గౌడ్, రేవతి గౌడ్, దేశగాని సాంబశివ గౌడ్, ఐలన్ గౌడ్, బొమ్మగాని నాగభూషణం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/taddy-musical-festival-should-be-stopped-immediately/article-15777

Tags: