దొంగల బీభత్సం.. మహిళపై దాడి చేసి బంగారం అపహరణ  మహిళ మృతి 

  • ఘటన స్థలాన్ని పరిశీలించిన  సిపి రష్మీ పెరుమాళ్ 

విశ్వంభర, హుస్నాబాద్ : ఇంట్లో నిద్రిస్తున్న మహిళ బోయిని రాజ్యలక్ష్మి (47)పై దాడి చేసిన దొంగలు ఆమె మెడలోని బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మంచినీళ్ల బండ గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మంచినీళ్ల బండ గ్రామానికి చెందిన బోయిని కనకయ్యకు ఇద్దరు భార్యలు. కనకయ్య హమాలీ పనిచేస్తుండగా రాజ్యలక్ష్మి కూలీ పనులు చేస్తోంది. గురువారం హమాలీ పనికి వెళ్లిన కనకయ్య ఇంటికి రాలేదు. మరో భార్య రాధవ్వ బయటకు వెళ్ళింది. దీనితో రాత్రి రాజ్యలక్ష్మి భోజనం చేసి ఇంట్లో పడుకుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఇదే అదనుగా భావించిన దొంగలు నిద్రిస్తున్న ఆమెపై దాడి చేసి మెడలోని పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. తరువాత ఇంటికి వచ్చిన రెండో భార్య రాధవ్వ తీవ్ర గాయాలతో మంచంపై ఉన్న ఆమెను చూసి చుట్టుపక్కల వాళ్లకు తెలిపింది. వెంటనే ఆమెను 108 అంబులెన్స్ లో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందింది. అయితే మెడలో ఉన్న బంగారం ఎత్తుకెళ్లేందుకు దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా, లేదా ఇంకా వేరే ఎవరైనా హత్య చేసి దొంగతనంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారా అనేది తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న సిపి రష్మీ పెరుమాళ్,హుస్నాబాద్ ఏసిపి సదానందం సిబ్బందితో అక్కడికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ని రప్పించి ఆధారాలు సేకరించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.WhatsApp Image 2026-05-22 at 9.15.10 PM

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/thieves-attacked-woman-and-stole-gold-woman-died/article-15765

Tags: