దుబ్బచెర్లలో స్మశాన భూమి అక్రమాలపై గ్రామస్థుల ఫిర్యాదు
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం దుబ్బచెర్ల గ్రామంలో ఎస్సీ మాదిగల స్మశాన వాటిక భూమిని అక్రమంగా వినియోగిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. గ్రామ సర్పంచ్ లిల్లీమేరి భర్త ఏరువ స్లీవారెడ్డి గ్రామపంచాయతి కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్సీ వర్గానికి చెందిన స్మశాన వాటిక భూమిని స్వప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు, దీంతో గ్రామ ప్రజలకు నష్టం జరుగుతోందని, ఎస్సీ వర్గాల హక్కులుదెబ్బ తింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు గ్రామస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు కలిసి ఎంపీడీవో, ఎంఆర్వో, ఆర్డీవో, డీపీవోలకు ఫిర్యాదు చేశారు,గ్రామపంచాయతి భూమిపై జరిగిన అక్రమాలను వెంటనే పరిశీలించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భూమిని తిరిగి గ్రామపంచాయతికి అప్పగించేలా చర్యలు చేపట్టాలని, సంబంధిత అధికారులపై విచారణ జరపాలని వారు కోరారు, ఈ కార్యక్రమంలో ఎర్ర కృష్ణ, పొ ట్టగల అశోక్, ఎర్ర రాజు, నడ్డి నరేష్, నడ్డి నరసింహ, పొ ట్టగళ్ల దేవేందర్, జాను నాయక్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.