న్యం కొనుగోళ్ళు ఎప్పుడు పూర్తయ్యేను?

న్యం కొనుగోళ్ళు ఎప్పుడు పూర్తయ్యేను?

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని అన్ని గ్రామాల్లోని 31 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు కేవలం 35 శాతం మేరకే కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఇంకా 65 శాతం ధాన్యం కొనుగోళ్లు కావాల్సి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా రోహిణి కార్తె సమీపిస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది, అకాల వర్షాల భయం రైతులను వెంటాడుతోంది. సమయానికి ధాన్యం కొనుగోళ్ళూ జరగకపోతే వర్షాల కారణంగా పంట నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఖరీఫ్ నార్లు పోసుకోవడం, పొలాలను వరినాట్లకు సిద్ధం చేసుకోవాలి. సీజన్ సమయం దాటిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

🕒 23 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/when-will-the-purchases-be-completed/article-15800

Tags: